డంపింగ్ యార్డ్ లో చెత్త నుండి సంపద తయారీ పై శిక్షణ....
డంపింగ్ యార్డ్ లో చెత్త నుండి సంపద తయారీ పై శిక్షణ....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్వహణ తడి చెత్త పొడి చెత్త నుండి సంపద తయారీపై ప్రత్యేక దృష్టి సారించిందని ఐఈసి ప్రత్యేక అధికారి జిల్లా కన్సల్టేషన్ ఆఫీసర్ పవన్ ఎంఐసి రవి అన్నారు బుధవారం మిడ్జిల్ మండల పరిధిలోని చిలువేరు గ్రామంలో మండల పంచాయతీరాజ్ కార్యదర్శులకు తడి చెత్త పొడి చెత్త నుండి సంపద తయారీ పై శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తడి చెత్తతో వర్మీ కంపోస్ట్, పొడి చెత్త నుండి గాజు, ప్లాస్టిక్, తదితర వస్తువులను వేరు చేయటం తద్వారా సంపద తయారీ విధానం పై ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు గ్రామాల్లోని చెత్తను సేకరించేందుకు ప్రతి కుటుంబానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలను అందజేస్తామన్నారు. దీంతో చెత్తను వృదా చేయకుండా ఉంటే సంపద పొంద వచ్చని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల ఎంపీడీవో సాయి లక్ష్మి ఎంపిఓ అనురాధ చిల్వేర్ గ్రామ సర్పంచ్ సంయుక్త రాణి మండల పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు