డాక్టర్లు దైవం కన్న మిన్న

 డాక్టర్లు దైవం కన్న మిన్న

~~~~~~~~~
నిస్వార్థ వైద్య సేవలందించాలనే తపన అందరిలో ఉండదని అది కొందరికే సాధ్యమని ఉచిత వైద్య శిభిరాలతో సిమ్స్ హస్పిటల్ వారు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మేన్ కెసి నర్సింహులు అన్నారు.సోమవారం పట్టణ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పారిశ్రామిక వాడలోని సిమ్స్ హస్పిటల్ వారి ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు.ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్లు దైవం కన్న మిన్న అని, కరోనా కష్టకాలంలో ఉచిత వైద్యశిభిరాన్ని నిర్వహించడం నిస్వార్ధ సేవలకు నిదర్శనమని కొనియాడారు.ఇట్టి వైద్య శిభిరంలో డాక్టర్ విజయ్ జనార్థన్,డాక్టర్ ప్రశాంతి,డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ అజయ్ రెడ్డి లు 110 రోగులకు తమ సేవలందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మేన్ నటరాజ్,రాజసింహుడు,ఆరిస్టో పారాస్యూటికల్ సిబ్బంది జమీరోద్దీన్,పురుషోత్తమరెడ్డి,రాజేందర్, రాజు,వెంకటేష్,శేఖర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.