మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ వారం రోజుల్లో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట్రావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు

  మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ వారం రోజుల్లో  ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట్రావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు.

      గురువారం ఆయన తన చాంబర్లో మహబూబ్ నగర్  అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలపై  గృహ నిర్మాణ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు.
     ముఖ్యంగా మహబూబ్ నగర్ గ్రామీనం, పట్టణం, హన్వాడ మండలాలలో కలిపి  సుమారు 3700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చేపట్టడం జరిగింది. ఇందులో 904 గ్రామీణ మహబూబ్నగర్లో, 2796 పట్టణ ప్రాంతాల్లో చేపట్టడం జరిగింది. 1706 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయి.వీటికి సంబంధించి మహబూబ్ నగర్  పట్టణంలోని ఏనుగొండలో చేపట్టిన 696 గృహాల నిర్మాణం వేగవంతంగా నడుస్తున్నదని ,ఇదేవిధంగా నియోజకవర్గం మొత్తం అన్ని ఇండ్ల నిర్మాణాలు కూడా  వేగా వంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 
             జర్నలిస్ట్ కాలనీ లో చేపట్టిన 101 గృహాల పనులను వేగవంతం చేయాలని  ఆదేశించారు .
         మహబూబ్ నగర్ గ్రామీణ పరిధిలో మాచన్ పల్లి, పోతనపల్లి, కోడూరు, అల్లీపూర్, చౌదర్పల్లి లో  చేపట్టిన ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, రామచంద్రపురం లో మాత్రం స్థలం కారణంగా ఇప్పటి వరకు ప్రారంభించనందున అక్కడ కూడా  తక్షణమే  స్థలాన్ని గుర్తించి పనులు  ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు .
        హన్వాడ మండలం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పెంచాలని, ఎక్కడైనా స్థల సమస్య ఉంటే పరిష్కరించి  స్థలాలు ఇవ్వాలని  తహసీల్దార్ లకు చెప్పారు.
       డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నూతన సాంకేతికతను వినియోగించుకొని ,ముఖ్యంగా షేర్ వాల్  పద్ధతిలో త్వరితగతిన ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు హౌసింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ విధానం ద్వారా వారంలో 4 ఇళ్లను పూర్తి చేయవచ్చని వారు తెలిపారు. 
     ఈ సమీక్ష సమావేశానికి గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, అసిస్టెంట్  ఇంజనీర్లు,కాంట్రాక్టర్లు, తదితరులు హాజరయ్యారు .
____________