క్రీడల్లో గెలుపోటములు సహజం క్రీడలు ఉల్లాసాన్ని పెంచుతాయి: ప్రముఖ సామాజికవేత్త కావలి పవన్ కుమార్ యాదవ్...

క్రీడల్లో గెలుపోటములు సహజం క్రీడలు ఉల్లాసాన్ని పెంచుతాయి: ప్రముఖ సామాజికవేత్త కావలి పవన్ కుమార్ యాదవ్...
జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో బహుమతుల ప్రధానం..
అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో మంగళవారం రోజు జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బహుమతుల ప్రదాత ప్రముఖ సామాజికవేత్త కావలి పవన్ కుమార్ యాదవ్ గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు మొదటి బహుమతి దేవరకద్ర ,రెండవ బహుమతి డోకూరు కు లభించాయి ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనని క్రీడలు ఉల్లాసాన్ని పెంచుతాయని గ్రామ స్థాయి నుండే క్రీడాకారులు తయారవుతారని క్రీడాకారులు మన దేవరకద్ర నియోజకవర్గంలో చాలామంది ఉన్నారని వారిని గుర్తించాలనే ఉద్దేశంతోనే క్రీడల పోటీలు జరిపిస్తున్నట్లు ఆయన అన్నారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి రాణించాలని ఎలాంటి సహాయ సహకారాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేనున్నానని క్రీడాకారులకు ఆత్మ స్తైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలో రాచాల సర్పంచ్ తిరుపతయ్య ,రవి తదితరులు పాల్గొన్నారు