కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న జెడ్పిటిసి సభ్యురాలు కళ్యాణి లక్ష్మణ్ నాయక్...

 కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న జెడ్పిటిసి సభ్యురాలు కళ్యాణి లక్ష్మణ్ నాయక్... 

 కరోనా  మహమ్మారి బారి నుండి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ అపోహలు వీడి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని బాలానగర్ జెడ్పిటిసి సభ్యురాలు కళ్యాణి లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు ఆమె తన భర్త లక్ష్మణ్ నాయక్ తో కలిసి బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  అనంతరం హాస్పిటల్ లో కోవిడ్ టెస్టులు, వ్యాక్సిన్ పై డాక్టర్ తులసీ తో అడిగి తెలుసుకున్నారు. సాధారణ రోగులతో పాటు కరోనా టెస్టుల కొరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు   జాగ్రత్తలు తీసుకోవాలని హాస్పిటల్ సిబ్బందికి జెడ్ పి టి సి సూచించారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నవి, కనుక టెస్టు కిట్లు, వ్యాక్సిన్ కొరత లేకుండా చేసుకోవాలని, గ్రామాల్లో,  తండాల్లో కోవిడ్ వైరస్ నియంత్రణ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆమె అప్రమత్తం చేశారు.