కోవిడ్ పై జిల్లా పోలీసుల యుద్ధం....

కోవిడ్ పై జిల్లా పోలీసుల యుద్ధం....

కోవిడ్ విస్తృతి నేపథ్యంలో మాస్కులు ధరించాలని జిల్లా వ్యాప్తంగా పల్లెలు, ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు.
మరోవైపున మాస్కు ధరించని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, విపత్తుల సమయంలో నిర్లక్ష్యంగా, బాధ్యాతారహితంగా వ్యవహరించడం తీవ్రమైన నేరమవుతుందని అన్నారు. కుటుంబం, సమాజం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ అంటురోగం ప్రమాదకరమైనదని, మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం వంటి చిన్నపాటి చర్యల వలన ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చని గుర్తించి, మన ప్రజలు తగిన విధంగా వ్యవహరించాలని వివరించారు. అవగాహన కల్పించడం వలన ప్రజలు మాస్కులు ధరించి సహకరిస్తున్నారని,  అయితే చట్టవిరుద్దంగా ప్రవరించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు వెల్లడించారు