కోవిడ్ బాధితులకు భరోసా... డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ..
కోవిడ్ బాధితులకు భరోసా... డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి .. రాజాపూర్ లో ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం ..కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి బాసటగా నిలుస్తుందని మహబూబ్ నగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కరోనా బాధితుల కోసం ఎనిమిది పడకల కోవిడ్ సెంటర్ ను ప్రారంభించారు. అలాగే మండల పరిధిలోని రంగారెడ్డి గూడ గ్రామానికి నాలుగు పడగలు, చెన్నై వెళ్లే గ్రామానికి మరో మూడు పడకల సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహమ్మారి అంతం కోసం అందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మరువకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శంకర్, ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, గ్రామ సర్పంచ్ కప్పేరి బచ్చి రెడ్డి, ఎక్స్ ఎంపీపీ, రైతుబంధు అధ్యక్షుడు నర్సింలు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కో ఆప్షన్ నెంబర్ అల్తాఫ్, నర్సింగ్ తండా ఉపసర్పంచ్ మొగిలి మహిపాల్, టిఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ వనపర్తి నరహరి, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, మల్లేష్ గౌడ్, వనపర్తి సత్తయ్య, విజయ్ కుమార్, లక్ష్మయ్య, తిరుపతయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.