సీఎం సహాయనిధి చెక్కు అందజేత... ఎంపీపీ సూది రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి...
సీఎం సహాయనిధి చెక్కు అందజేత... ఎంపీపీ సూది రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి... తెలంగాణ ముఖ్యమంత్రి కే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహాయనిధి చెక్కు ఎంపీపీ సూది రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. దేవరకద్ర నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశానుసారం కేంద్రానికి చెందిన వనం దశరథ కు సీఎం సహాయనిధి నుంచి60,000 వేల రూపాయల చెక్కును ఆయన చేతికి అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పడ్డ తర్వాత అనేక సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టిందని అదేవిధంగా సీఎం సహాయనిధి నుంచి అనేక మంది పేదలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తుందని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదని. ఈవిధంగా పేదల పేదలకు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు మనమంతా రుణపడి ఉన్నామని ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ఎవరు ఆపదలో ఉన్న వారికి వెంటనే ఆర్థిక సహాయం గాని సంక్షేమ పథకాలు గాని అనేక రకాలుగా మనకు అందే విధంగా కృషి చేస్తున్నాడని అందుకోసమే మిమ్మల్ని మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఉండాలని మనం అంత కోరుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు మోహన్ గౌడ్ జెడ్పిటిసి రాజేశ్వరి రాము శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఉప సర్పంచ్ లక్ష్మణ్ టిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.