చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం ....అదనపు కలెక్టర్ కే. సీతారామారావు .....
చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ కే. సీతారామారావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెరువులు, కుంటల పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేషంలో మాట్లాడారు. మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే చెరువులు,కుంటలు,శిఖం భూములు తదితర విషయాల పై కమిటీ సమావేశంలో చర్చించారు .అన్ని చెరువుల వద్ద చెరువు పేరు ,ఇతర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నిటికీ సంబంధించి ఒక నివేదికను సమర్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి కె. స్వర్ణలత ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్,సర్వే లాండ్ రికార్డుల ఎడి శ్యాంసుందర్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, మహబూబ్ నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, మున్సిపల్ ఇంజనీర్ బెంజమిన్, తదితరులు హాజరయ్యారు.