చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి.......
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి.
కోయిలకొండ. కోయిల్ సాగర్ డ్యాం లో చేపల వేటకు వెళ్లి రవి 35 సంవత్సరాలు మృతి చెందిన సంఘటన అంకిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అఖిల గ్రామానికి చెందిన రవి 25వ తేదీ నాడు సాయంకాలం కోయిల్ సాగర్ డ్యాం లోకి వెళ్లి చేపల వలలు విడిచి తిరిగి ఇంటికి వచ్చి 26వ తేదీ ఉదయం 5 గంటలకు చాపలు తీస్తానని చెప్పి వెళ్లడం జరిగింది తెలిపారు. ఉదయం ఏడు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పోచమ్మ అనే వ్యక్తి వారి ఇంటి వద్దకు వెళ్లి మీ భర్త రవి చేపల వాళ్ళ కాళ్ళ కు చుట్టుకొని మృతిచెందాడని తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులు గ్రామస్తుల తోలుకొని వెళ్లి చూడగా రవి మృతి చెంది ఉండటం చూసి ఒడ్డుకు తీసుకోవడం జరిగిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఎస్సై సురేష్ గౌడ్ తెలిపారు