చలివేంద్రాలు ప్రారంభించిన నావీద్ అహ్మద్....
చలివేంద్రాలు ప్రారంభించిన నావీద్ అహ్మద్....
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కుటుంబ సభ్యులు దాహార్తి తీర్చుకునేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని naveed అహ్మద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రక్కన మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు చలివేంద్రాలు నవీన్ అహ్మద్ తండ్రి సేట్ నాసిర్ అహ్మద్ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అహ్మదియ్యా సంఘం ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు సెంటర్లను వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచి చక్కటి మంచి నీటి త్రాగేందుకు ప్రజల ఆరోగ్యం కోసం చల్లని మంచినీళ్లు ప్రజలు తాగాలని ఉద్దేశంతోనే రెండు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. ప్రజలు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని మండల ప్రజలకు వారు సూచించారు. ముఖ్యంగా కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు సామాజిక దూరం శానిటేషన్ వాడాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమోహన్ గౌడు ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పిటిసి వట్టెం రాజేశ్వరి రాము, తహసీల్దార్ సువర్ణ రాజు ఎంపీడీవో శ్రీనివాసులు డాక్టర్ బలరాం అహ్మదీయ సంఘం జిల్లా అధ్యక్షులు వజీర్ బాబు, బిజెపి నాయకులు ఓబీసీ జిల్లా అధ్యక్షులు నందిరాజు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కురువ రమేష్, వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు.