కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పాటించండి మాస్కులు లేకుండా బయటకు రావద్దు సర్పంచ్ కప్పెరి బచ్చిరెడ్డి..
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పాటించండి
మాస్కులు లేకుండా బయటకు రావద్దు సర్పంచ్ కప్పెరి బచ్చిరెడ్డి..
కరోనా వ్యాధి దేశంలో రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో రాజాపూర్ మండల కేంద్రానికి వచ్చే వివిధ గ్రామాల ప్రజలు కానీ, రాజాపూర్ ప్రజలు గాని తప్పనిసరిగా మాస్కు ధరించి బయటకు వెళ్లాలని లేకపోతే కారోనా వ్యాధి బారిన పడతారని రాజాపూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చి రెడ్డి మంగళవారం అన్నారు.అలాగే కరోనా వ్యాధి రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా 45 సంవత్సరాలు పైబడిన వారందరూ ప్రభుత్వ ఆసుపత్రి రాజాపూర్ లో ఉచితంగా కరోనా వ్యాధి టీకాలు వేయించుకోవాలని అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ శానిటైజర్ వాడితో కరోనా బారిన పడకుండా ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టె ఉద్దేశంతో లేవు. కాబట్టి అందుకు తగ్గట్లుగా మనం కూడా వ్యవహరిస్తే ప్రజారాజ్యం బాగుంటుందని తద్వారా మన ఆరోగ్యం కూడ బాగుంటుంది ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ఉప సర్పంచ్ అల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు గోరు వెచ్చటి నీళ్ళు తాగుతూ ఆహారంలో పండ్లు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, తీసుకోవాలని ఆయన సూచించారు.