కరోన వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దు....
కరోన వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దు....
వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే అది వారంలోపే తీవ్రం అవుతుంది. రోగి మరణించవచ్చు.అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే, అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా ట్రీట్మెంట్ పొందవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే అది పనిచేస్తున్నట్లు అర్థం. మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో, యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతోవేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటాము. వేడి పుట్టినప్పుడు శరీరంలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకోవచ్చు. శరీరంలో పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ మానవ శరీరం లోకి వస్తే వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.
కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో, కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ భారతదేశంలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.వ్యాక్సిన్ వేయించుకున్న కరోనా సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక, లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది.ఐతే కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ప్రజలందరూ ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.