కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఉపాధ్యాయులు...

కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఉపాధ్యాయులు...

వైద్య అధికారిని సేవలకు ధన్యవాదాలు తెలిపిన పిఆర్టియు సంఘ నాయకులు 
భూత్పూర్ మండల ఉపాధ్యాయులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు సత్తూరు బాలరాజ్ గౌడ్, పి ఆర్ టి యు తెలంగాణ అధ్యక్షులు రవి చంచల  కోరిక మేరకు మండల ఉపాధ్యాయులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసిన  వైద్యాధికారిని సంధ్యా కిరణ్మయి  దగ్గర ఉండి వ్యాక్సినేషన్ వేయించినారు.  లాక్ డౌన్ సమయం లో ఉపాధ్యాయులు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఇప్పుడైనా గురువులకు వైద్య సేవలు అందించే  అవకాశం తమకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నామని డాక్టర్ సంధ్య పేర్కొన్నారు. 
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు చేసిన ఆమె సేవలకు మండల ఉపాధ్యాయులు ధన్యవాదములు తెలిపారు. నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారు నేరుగా రావాలని,  నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు సర్టిఫికెట్ తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని  వైద్య అధికారులు తెలిపారు.