కరోన సమయంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ,ఆక్సీజన్ సిలిండర్లు వితరణ ఇవ్వడం అభినందనీయం ... మంత్రి వీ . శ్రీనివాస్ గౌడ్...

కరోన  సమయంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ,ఆక్సీజన్ సిలిండర్లు వితరణ ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో హైదరాబాద్ కు చెందిన సోషియల్ డేటా ఇనిషియేటివ్స్ ఫోరమ్(ఎస్ డి ఐ ఎఫ్) ఆధ్వర్యంలో 15 ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను వితరణ చేయగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  మహబూబ్ నగర్ జిల్లా ను వైద్య రంగంలో హైద్రాబాద్ కు ధీటుగా తీర్చి దిద్దుతున్నామని,  మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో   500 పడకలు, ఆక్సిజన్ ప్లాంట్, 60 వేంటిలేటర్లు ఉన్నాయని , వీటితో పాటు ఇదే రోజున తెలంగాణ డియాగ్నోస్టిక్ హబ్ ను ప్రారంభిస్తున్నామని, ఇంకా అత్యాధునిక సౌకర్యాలు కలుగజేసి హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వచ్చి వైద్యం చేయించుకునే లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో అద్భుతమైన పట్టణంగా  మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దుతామని,ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బైపాస్ రహదారిని పూర్తి చేశామని, 2097 ఎకరాలలో దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్కును, 500 ఎకరాల్లో ఐటీ హబ్ వంటివి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేశామని, అంతేకాక పట్టణంలో రహదార్ల విస్తరణ,కూడళ్ళ అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని,ప్రతి  రోజు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు.మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్ ,వార్డు కౌన్సిలర్ వనజ, ఎస్ డి ఐఎఫ్ ప్రతినిధులు ఇజాజ్ ,అబిద్ జల్,షబ్బీర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.