కరోనా పట్ల ఆందోళన వద్దు ముందు జాగ్రత్తతో కరోనా దూరం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్....
కరోనా పట్ల ఆందోళన వద్దు ముందు జాగ్రత్తతో కరోనా దూరం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.... కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లున్నాయి, మందులు ,ఆక్సిజన్, వ్యాక్సిన్ తో సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం అయన ఉదయమే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కరోనా వార్డు ను పరిశీలించారు. ముందుగా అత్యవసర సేవల విభాగగాన్ని సందర్శించారు.అనంతరం కరోనా వార్డును సందర్శించి ఎంత మంది రోగులు ఉన్నారని? వారికి చికిత్స ఎలా అందిస్తున్నారని? అంతేకాక అందుబాటులో ఉన్న ఆక్సిజన్, మందులు తదితర వివరాలను క్యాజువాలిటీ ఎమర్జెన్సీ మెడికల్ అధికారి ద్వారా అడిగి తెలుసుకున్నారు .మంత్రి ఫార్మసీలో ని రేమిడి విసిఆర్,డాక్సీ, ఇతర కరోనా మందులను పరిశీలించారు. ఈ మందులు , సరఫరా ఎలా చేస్తున్నారని ఫార్మసీ ఇన్చార్జి ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ కారోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ,ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, ఎస్వీఎస్ హాస్పిటల్ లో కూడా ప్రభుత్వం తరఫున 100 పడకల కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామని ,ప్రభుత్వ ఆసుపత్రులో కూడా చాలినాన్ని పడకలు, ఆక్సిజన్,మందులు అన్ని సిద్ధంగా ఉంచామని, అందువల్ల ప్రజలు ఏలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా ఉంటే కట్టడి చేయవచ్చు అని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, అవసరమైన అన్ని పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా సేవలుఅందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు . హైద్రాబాద్ కు ధీటుగా జిల్లాలో ఏర్పాట్లు ఉన్నాయని,ఎవరు హైద్రాబాద్ వెళ్లాల్సిన పని లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్వీఎస్ మెడికల్ ఆసుపత్రిలో కరోనా వార్డులో చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు . మంత్రి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, డి పి ఆర్ ఓ వెంకటేశ్వర్లు,ఎస్ వి ఎస్ పి ఆర్ ఓ కిరణ్, తదితరులు ఉన్నారు.