మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ గురించి వివరిస్తూ, బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఆయా చౌరస్తాలలో పోలీసు అధికారులు ప్రచారం

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ గురించి వివరిస్తూ, బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఆయా చౌరస్తాలలో పోలీసు అధికారులు ప్రచారం చేస్తున్నారు. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలందరూ చట్టాలకు లోబడి బాధ్యతాయుతంగా నడుచుకోవాలని, ప్రస్తుతం కరోనా మహమ్మారి నిర్మూలనకై ప్రభుత్వ ఆదేశాల మేరకు మనందరం కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేవారు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అవసరమని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.