కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ....

కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ....
కరోణ కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
సిపిఎం జిల్లా కార్యదర్శి    ఏ రాములు మిడ్జిల్ మండల పరిధిలోని వాడ్యల గ్రామంలో  కరోణ వైరస్ తో బాధపడుతున్న బాధితులకు  ఏ రాములు సోమవారం ఒకే కుటుంబానికి చెందిన 18 మందికి కరోనా సోకడంతో వారికి మనోధైర్యం కల్పిస్తూ గ్రామస్థులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తతోనే కరోణ వ్యాధి ని అంతం చేయాలని వ్యాధి సోకిందని ఆందోళనకు గురికాకుండా ధైర్యంతో ఉండాలని వారు అన్నారు చాలామంది ఆందోళనకు గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు లాక్ డౌన్ పెట్టడంతో చాలామంది  వలస కూలీలు కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వమే ఉచితంగా ఐదు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేసి ఉచితంగా ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లాస్ అధ్యక్షులు రాజేష్ కుమార్  కానీ స్టేబుల్ శేఖర్ భీమయ్య ఆశ వర్కర్ నర్మద పాస్టర్ పరిమళ రాజు తదితరులు పాల్గొన్నారు