సీఎం సహయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుంది - జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి .....

 సీఎం సహయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుంది - జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి .....

జడ్చర్ల నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు 46 లక్షలు రూపాయలు (CMRF) చెక్కులను అందజేసిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ...
జడ్చర్ల నియోజకవర్గంలోని (63) మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు కాబడినా ₹ 46.00 లక్షలు రూపాయల (CMRF) చెక్కులను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి  చేతులమీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ని చాలా మంది నిరుపేదలు పలు ప్రవేట్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతూ డబ్బుల కోసం ఇబ్బందులు పడకుండా వుండాలని ఉదేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం సహయ నిధిని ఏర్పాటుచేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిరుపేదల కష్టాలు గురించి గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆలోచన చేయలేదని, ముఖ్యమంత్రి సహాయ నిధులతో నిరుపేదలకు లక్షలు రూపాయలు ఆర్థికసాయం అందచేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితెలిపారు. కరోనా లాంటి విపత్కారా పరిస్థితులలో కూడా పేదల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ సంక్షేమ పధకాలను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదల కోసం పనిచేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  అన్నారు.