సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే....
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.... నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోయిలకొండ మండలానికి చెందిన బాధితులకు అందించడం జరిగిందని సింగిల్విండో చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా కోయిలకొండ మండలం లో ఉన్న పారుపల్లి గ్రామానికి చెందిన రవీందర్ గౌడ్ కు 33500. రామన్న పల్లి తాండ కు చెందిన జ్యోతి కి 20, 000. రాజు నాయక్ 34000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాసు పాల్గొన్నారు