బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా పల్లె తిరుపతి ముదిరాజ్ నియామకం....

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా పల్లె తిరుపతి ముదిరాజ్ నియామకం
 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్  మండలానికి చెందిన పల్లె తిరుపతి ముదిరాజ్  భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ప్రకటించడం జరిగింది.పల్లె తిరుపతి గతంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అదే కాకుండా విద్యార్థి సమస్యలపై అనేక సమస్యలపై పోరాడి మిడ్జిల్ గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికై మరియు  బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శిగా  బిజెపిలో చురుకైన పాత్ర పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీ పటిష్టతకు చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించడం జరిగింది .ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యత ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ అన్నగారికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు  భాను ప్రకాష్ గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు ఈ పదవి రావడానికి కృషిచేసిన రాష్ట్ర   జిల్లా మండల నాయకులకు  కృతజ్ఞతలు తెలియజేస్తునట్లు నూతనంగా ఎన్నికైన పల్లె తిరుపతి తెలిపారు.

యువమోర్చా బలోపేతానికి విశేషంగా కృషి చేస్తానని  పెద్ద సంఖ్యలో యువతను పార్టీలో చేర్చడానికి కృషి చేస్తానని తెలియజేశారు.నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేస్తాని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.అందరినీ కలుపుకొని పోయి పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తానన్నారు.