బిజెపి లో చేరిన టి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు....
బిజెపి లో చేరిన టి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు....
మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపనున్న పార్టి ఫిరాయింపులు
జడ్చర్ల పట్టణానికి చెందిన టి ఆర్ ఎస్ పార్టి నాయకుడు పెద్ది బాలకృష్ణ తన సతీమణి కల్పనతోపాటు తన అనుచరులతో కలిసి బిజెపిలో చేరారు. టిఆర్ఎస్ ఛైర్ పర్సన్ అభ్యర్ధిగా తన భార్య కల్పనతో పోటి చేయించాలని భావించిన బాలకృష్ణ అందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించక పోవడంతో ఈ హఠాత్తు నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణ పార్టి ఫిరాయింపు మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పెద్ది బాలకృష్ణ దంపతులకు ఆదివారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్,రాష్ట్రకోశాధికారి శాంతకుమార్, జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ లు పార్టి కండువాలు కప్పి పార్టిలోకి సాదరంగా ఆహ్వానించారు.బాలకృష్ణ దంపతుల పార్టి పిరాయింపుతో జడ్చర్లలో రాజకీయం రసవత్తరంగా మారింది.