భూములకు సంబంధించిన విషయాల పట్ల తహశీల్దార్లు తక్షణమే స్పందించాలి --జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు..
భూములకు సంబంధించిన విషయాల పట్ల తహశీల్దార్లు తక్షణమే స్పందించాలి --జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు..మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి తాహసిల్దార్ లతో ధరణి, పెండింగ్ మ్యుటేషన్లు,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ రక్షణ తో పాటు,ప్రజలు కరోనా బారిన పడకుండా మాస్కు ధరించడాన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని, గతంలో ఏర్పాటు చేసినట్లు గానే మాస్క్ ను తప్పనిసరి చేస్తూ టాస్క్ఫోర్స్ బృందాలను నియమించాలని, ఈ రోజునుండే ఈ బృందాలు అన్ని మున్సిపాలిటీ లు,గ్రామాలలో పర్యటించాలని ఆదేశించారు. రెవిన్యూ, గ్రామపంచాయతీ నుండి ఒక్కొక్కర్ని ఈ టాస్క్ ఫోర్స్ బృందంలో ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలని అన్నారు.ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో శానిటేషన్ చేయాలని సూచించారు.మ్యుటేషన్షకు సంబంధించి తాహసిల్దార్లు తప్పులు చేయవద్దని, మ్యుటేషన్లు పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలని, భూముల విషయంలో తక్షణం స్పందించాలని, ఎక్కడైనా తప్పు జరిగినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ధరణి పోర్టల్ లో తప్పులకు సంబంధించిన విషయాలను తమ దృష్టికి తీసుకు రావాలని కలెక్టర్ తెలిపారు.తాసిల్దార్లు కోర్ట్ కేసులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, తెలిపారు.ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాసిల్దారులు మండల స్థాయిలో ధాన్యం కొనుగోలులో నోడల్ అధికారిగా నిర్వహించాలని అన్నారు .ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు రెవెన్యూ శాఖ తరఫున తహసిల్దార్ లేదా డిప్యూటీ తాసిల్దార్ , రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను పంపించాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం,2000 /- రూపాయల నగదు ఇస్తున్నందున జిల్లాలో ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకుగాను తహశీల్దారులు ఎం ఈ ఓ లతో ముందే సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ రేషన్ షాపుకు ఎవరరెవరిని కేటాయించారో ముందే తనిఖీ చేసుకోవాలని ,ఈ విషయమై రేషన్ డీలర్లను పిలిపించుకొని మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్సు కు జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కె.సీతారామరావు, డిఆర్ఓ కే.స్వర్ణలత, తదితరులు హజరయ్యారు.