భారీగా నామినేషన్లు దాఖలు...పోటీలో నిలిచిన హేమాహేమీలు...
భారీగా నామినేషన్లు దాఖలు...పోటీలో నిలిచిన హేమాహేమీలు...
శ్రమకోర్చిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ..సజావుగా నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు..జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సంబందించిన నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది.నామినేషన్ల దాఖలుకు చివరిరోజు అయిన ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీల తరపున హేమాహేమీలు ఎన్నికల బరిలో నిలిచారు.దీంతో నిన్నటి వరకు స్థబ్దుగా ఉన్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కిపోయింది.అభ్యర్థులు తమ మద్దతు దారులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తమ ఇష్ట దైవాలకు మొక్కుకుని ఇళ్లనుండి బయలుదేరిన అభ్యర్థులకు మద్దతుగా వారి అనుచరులు,మద్దతుదారులు దారిపొడవునా బాణా సంచాలు పీలుస్తూ,నృత్యాలు చేస్తూ పట్టణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖులు దగ్గరుండి తమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు.
నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహింపజేసేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది భారీగా శ్రమించారు.ముఖ్యంగా పోలీసులు భానుడు తీవ్రంగా ప్రభావం చూపుతున్న లెక్కచేయకుండా తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు.నామినేషన్ పత్రాలను దాఖలు చేయదానికి వచ్చిన అభ్యర్థులతోపాటు వారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి వచ్చిన వారితో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం మొత్తం కిచకిచలాడింది.వారందరు సెదతీరేందుకు అవసరమైన టెంట్లు వేసి మున్సిపల్ అధికారులు వారికి తమ సహకారాన్ని అందించారు.