భారత్ మాల రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరిన పాలకొండ గ్రామ రైతులు...
భారత్ మాల రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని పాలకొండ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ తో కోరారు. భారత్ మాల రహదారి నిర్మాణానికి ఇష్టపూర్వకంగానే తమ భూములను ఇచ్చినట్లు వారు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. భారత్ మాల రహదారి నిర్మాణం సందర్బంగా భూములు కోల్పోతున్న పాలకొండ రైతులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావును కలిసి దరఖాస్తు ఇచ్చారు.భారత్ మాల రహదారిని త్వరగా పూర్తి చేయాలని, తమ భూముల నుండి భారత్ మాల రోడ్డు వెళ్తున్నదని, తాము భూములు కోల్పోతున్నామని , తమకు నష్టం జరుగుతున్నదని తెలిసినప్పటికిని మిగులు భూములకు మంచి విలువ వస్తుందని, పెద్ద రహదారులు రావడం వల్ల తమ గ్రామం తో పాటు, తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి తమ భూములను ఇష్టపూర్వకంగానే ఇచ్చామని తెలిపారు. కాని కొందరు దురుద్దేశంతో భారత్ మాల రోడ్డు రద్దయిందని చెబుతున్నారని, అందువల్ల భారత్ మాల రోడ్డు త్వరగా పూర్తి చేయాలని, మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని,ఇందుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని వారు దరఖాస్తు లో పేర్కొన్నారు. దరఖాస్తు సమర్పించిన వారిలో కౌన్సిలర్ కిషోర్, పాలకొండ గ్రామానికి చెందిన కేశవులు, పిట్ట హనుమంతు, లింగం, వెంకటయ్య, మొగులమ్మ, పొక్కిరి ఎల్లయ్య, నర్సింహులు ,వెంకటమ్మ, దాసరి ఆనంతమ్మ తదితరులు ఉన్నారు.