భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న జీవిత బీమా రంగ సంస్థ

భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసి ప్రైవేటీకరణ జరుగుతుందన్న దుష్ప్రచారం లో వాస్తవం లేదని ఎల్ ఐ సి లో ప్రభుత్వానికి ఉన్న వాటాను కొంత భాగాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లియాఫి అఖిలభారత మాజీ అధ్యక్షులు జాతీయ ముఖ్య సలహాదారు ఎస్ బి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎల్ఐసి కార్యాలయం లో అఖిలభారత లియాఫి పిలుపుమేరకు ఎల్ఐసి ఏజెంట్ ల రెస్ట్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఏజెంట్ల హక్కుల పరిరక్షణకై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ మనుగడలో ఏజెంట్ల పాత్ర ప్రముఖమైనది అన్నారు ప్రభుత్వానికి ఎల్ఐసి ప్రతి సంవత్సరం సుమారు 20 వేల కోట్ల రూపాయల డివిడెండ్లు పన్నుల రూపంలో భారత ప్రభుత్వానికి సమకూరుస్తుందని అన్నారు ఇలాంటి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ప్రభుత్వం తమ తమ పెట్టుబడులను ఎంత మాత్రం ఉపసంహరణ చేసుకోవద్దని ఉపసంహరణ జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలభారత లియఫి ఈసీ మెంబర్ రంగ రాములు డివిజన్ నాయకులు వెంకట్ రెడ్డి డి శ్రీరామ్ నల నీ కాంత్ బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రయ్య  రంగా భాను ప్రకాష్ శ్రీహరి గౌడ్ శోభన్ బాబు లక్ష్మయ్య లతా తదితరులు పాల్గొన్నారు