భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ కొండ క్షేత్రం ....

భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ కొండ క్షేత్రం ....                                                                                                                                                                                                   కోయిలకొండ  మండలంలో వెలిసిన శ్రీరామ పాదాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ రామ కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీరామ పాదాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా si సురేష్ పోలీస్ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా పూజారి రాఘవేందర్ రావు స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి దీపార్చన తో పాటు వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అంతకు ముందు స్వామి వారిని నారాయణపేట ఎమ్మెల్యే సోదరుడు రవీందర్ రెడ్డి, జెడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కోయిలకొండ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు మల్ల యాదవ్, భీ 0 రెడ్డి, మో ధి పూర్ రవి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.