బ్యాంకు ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చేందుకు తక్షణమే బ్యాంకులలో పని చేసే ఉద్యోగుల వివరాలను సమర్పించాలని ఎల్ డి ఎం ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు...
బ్యాంకు ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చేందుకు తక్షణమే బ్యాంకులలో పని చేసే ఉద్యోగుల వివరాలను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఎల్ డి ఎం ను ఆదేశించారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు రైతుబంధు నిధులను పొందేందుకు బ్యాంకులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లో బ్యాంకు అధికారులు, డిఎంఅండ్ హెచ్ ఓ తో వాక్సినేషన్ ,తదితర అంశాలపై సమీక్షించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సిన్ ఇవ్వడంలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, సూపర్ స్ప్రేడర్లకు ఇది వరకే టీకాలు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు ఉద్యోగులకు కూడా వాక్సిన్ ఇచ్చేందుకు ఆయా బ్యాంకులలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సమర్పించాలని తెలిపారు వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు పంట ఋణాలిచ్చేందుకు ఇప్పటినుండే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే మంగళవారం (15 వ తేదీ) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు వానాకాలం కార్యాచరణ ప్రణాళిక ను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎల్ డిఎం నాగరాజరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఎస్ బి ఐ ఏ జి ఎం దినేశ్ గురునాథ్,యూనియన్ బ్యాంక్ డిజిఎం రమణ,జీవిబి ఏ జి ఎం మనోజ్ కుమార్ , తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.