బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు..
బిజేపి నాయకులు కేంద్రం లో అధికారంలో ఉండి.. పవర్ లోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారు.. ఎప్పుడు నెరవేరుస్తారు.. మీరు అధికారంలో ఉండి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది... సుష్మా స్వరాజ్ పాలమూర్ రంగరెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇస్తామన్నారు.. ఏమైంది..బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు.. lic.. BSNL.. railway అన్నీ ప్రైవేట్ చేస్తున్నామని చెప్పడానికి పాదయాత్ర చేస్తున్నారా..నాయకులు మాట్లాడితే.. యువత.. మేధావులకు ఆదర్శంగా వుండాలి.. వారంతా రాజకీయాల్లోకి రావాలని అనుకోవాలి.. కానీ మీరు మాట్లాడే భాష విని.. వారు విస్మయానికి గురయ్యారు..రెండేళ్లు ఉన్న ఎన్నికలకు ఇప్పటినుంచి.. విషం చిమ్మడం తగదు. సిఎం కేసిఆర్ పై చిల్లరగా మాట్లాడుతున్నారు.. కానీ.. మేము పిలుపు ఇస్తే.. మీరు తట్టుకోలేరు.. కానీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం.. మా దృష్టి పేదలకు సేవ.. రైతాంగ అభివృద్ధి.. మహారాష్ట్ర లో కేంద్ర మంత్రి ని అరెస్టు చేసారు.. మాకు చేత కాక కాదు.. కానీ చిల్లెర మల్లెర వాళ్లను పట్టించుకోము.పాదయాత్ర లో మీరు అడగండి.. ప్రతి గ్రామంలో జనాన్ని అడగండి.. 70 ఏళ్లలో జరిగిందేమిటి.. ఏడేళ్ళలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోండి. సీఎం ను ప్రజా ప్రతినిదులను గౌరవించే తీరు ఇదేనా... మీరు మాట్లాడే భాష ఏమిటీ.. ప్రజలు మీకు ఎదురు తిరిగి పాతాళానికి తొక్కేస్తారు.