బాలనగర్ ఎస్ఐ బదిలీ ....ఎస్సై కృష్ణయ్యను ఘనంగా సన్మానించిన పలువురు నాయకులు..

 బాలనగర్ ఎస్ఐ బదిలీ ....

ఎస్సై కృష్ణయ్యను ఘనంగా సన్మానించిన పలువురు నాయకులు 
భవిష్యత్తులో మరింత ప్రజా సేవ చేయాలని ఆకాంక్ష గత రెండు సంవత్సరాల క్రితం బాలనగర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణయ్య మంగళవారం మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. విధినిర్వహణలో బదిలీలు సర్వసాధారణమని, ఎక్కడున్నా.. ప్రజలకు తన పరిధి మేరకు సేవలు చేయడానికి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్ఐ పేర్కొన్నారు.  విధి నిర్వహణలో తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి కృష్ణయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో వైస్ ఎంపీపీ వెంకటాచారి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా ఎస్ ఐ నో పూలమాల శాలువాతో సత్కరించడం జరిగింది.