బాలానగర్ లో కఠిన చర్యలు.. మాస్క్ లేకుంటే జరిమానా, కేసులు బాలానగర్ ఏఎస్ఐ నాగేశ్వర్ రెడ్డి హెచ్చరిక....

బాలానగర్ లో కఠిన చర్యలు.. మాస్క్ లేకుంటే జరిమానా, కేసులు 

బాలానగర్ ఏఎస్ఐ నాగేశ్వర్ రెడ్డి హెచ్చరిక.... 
కరోనా నిబంధనలపై మండల పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు బాలనగర్ మండల ఎఎస్సై నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన బాలనగర్ మండల చౌరస్తాలో మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి సూచనలు సలహాలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ లేకుండా బయటకి వస్తే జరిమానాలు విధించాల్సి వస్తదని,  నిబంధనలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా జనం ఉంటే కేసులు నమోదులు చేస్తామని హెచ్చరించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే  కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. వివిధ రకాల వాణిజ్య వ్యాపార సముదాయాల లో ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో నిబంధనలను పక్కాగా పాటించాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే షాపు యజమానులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, కరోనా వైరస్ కట్టడికి పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని ఆయన గుర్తు చేశారు.