బడుగు బలహీనవర్గాలు ఏకం కావాలి : పల్లె తిరుపతి ముదిరాజ్...

బడుగు బలహీనవర్గాలు ఏకం కావాలి : పల్లె తిరుపతి ముదిరాజ్...

బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏకమై రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం పోరాడాలని తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి ముదిరాజ్  పిలుపునిచ్చారు.  బడుగుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతి సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో  ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావుపూలే నిరంతరం కృషి చేశాడని యువత పూలే మార్గంలో పయనించాలని మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు పట్నం జంగయ్య పల్లె శ్రీను గుళ్ళ శ్రీశైలం పల్లె అరవింద్ నిడుదవెళ్లి రాము ఎల్లికంటి కృష్ణయ్య పట్నం అంజయ్య వడ్డె కృష్ణయ్య పట్నం వెంకటయ్య చెన్నకేశవ శేఖర్ తదితరులు పాల్గొన్నారు