బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు కృషిచేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని జిల్లా కలెక్టర్ వెంకట రావు అన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు కృషిచేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని జిల్లా కలెక్టర్ వెంకట రావు అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే 195 వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు .  అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.  సమాజంలో  ఆర్థిక అసమానతలను రూపు మాపినప్పుడే సమానత్వాన్ని తీసుకురావడానికి సాధ్యమవుతుందని అన్నారు .మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి  తన భార్యను అక్షరాస్యు రాలిగా,   మొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మ జ్యోతిబాపూలేది అని కొనియాడారు. మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు నేటితరం కృషి చేయాలని అన్నారు .స్త్రీ జనోద్ధరణకు, సంఘసంస్కరణ లకు కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిబాపూలే అని కలెక్టర్ చెప్పారు.   జిల్లా బి.సి.సంక్షేమ అధికారి ఇందిర, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.