బాధిత కుటుంబానికి ₹ 7,00,000/- చెక్కులను అందచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ...

బాధిత కుటుంబానికి ₹ 7,00,000/- చెక్కులను అందచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి .మనీషా కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. - జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి.ఉరుకొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన రాజు కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మరణించారు. విరికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందుకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు అయిన ₹ 2,00,000 లక్షల చెక్కును మరియు ప్రభుత్వం నుండి మంజూరు కాబడినా ₹ 5,00,000 లక్షల చెక్కును (మొత్తం ₹ 7,00,000 లక్షలు)  వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే Dr.C.లక్ష్మా రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లపుడు అండగా ఉంటుందని గౌరవ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి  అన్నారు.