బేబీ వెల్నెస్ షో లో సిపిడిఓ మెహరున్నిసా బేగం ...
బేబీ వెల్నెస్ షో లో సిపిడిఓ మెహరున్నిసా బేగం ...రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో మంగళవారం బేటి బచావో బేటి పడావోలో భాగంగా వెల్ బేబీ షో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిడిపిఓ మెహరున్నీసా బేగం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు గత మూడు నెలల నుండి సకాలంలో టీకాలు తీసుకోవడం లాంటి విషయాలలో చురుకుగా పాల్గొన్న మూడు కుటుంబాలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు చిన్నారులకు డ్రెస్ లను కూడా అందజేసినట్లు వివరించారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు శాలువాలు, పూలమాలతో సత్కరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మిదేవి, డాక్టర్ ప్రతాప్ చౌహన్, ఉపసర్పంచి రాములు గౌడ్, ఎంపీటీసీ సునీత శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.