బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు కృషి చేద్దాం ....ఎంపీపీ శశికళ భీ 0 రెడ్డి....

 బాబు జగ్జీవన్ రావు  ఆశయ సాధనకు కృషి చేద్దాం .....                                                   సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాబు జగజీవన్ రావ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీపీ శశికళ భీ 0  రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రావ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి , భీ 0 రెడ్డి, సూపర్ టెంట్ హరిచంద్ర రెడ్డి, ఎంపీటీసీ  ఆంజనేయులు, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.