బి.ఎడ్ కళాశాలల పై చర్య తీసుకోలేని స్థితిలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు.....
బి.ఎడ్ కళాశాలల పై చర్య తీసుకోలేని స్థితిలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు......
* రిజిస్టార్ బి.ఎడ్ కళాశాలల చర్య తీసుకోవాలని టీ ఈజీ యు ఏ డిమాండ్.
* బిఎడ్ కళాశాలలు భ్రష్టు పట్టడానికి రిజిస్టర్, రామకృష్ణ ఓ ఎస్ డి, పి ఆర్ ఓ బాధ్యత వహించాలి.
* జె డి చంద్ర కిరణ్ ను మాత్రమే బలి చేయడం సరికాదు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి నల్లవెల్లి భరత్ మాట్లాడుతూ, పాలమూరు విశ్వవిద్యాలయం లో జే.డి చంద్ర కిరణ్ ఒక్కడిని బాధ్యుడు చేయడం సరికాదు అన్నారు. ఉన్నతాధికారులు ఓ ఎస్ డి, మధుసూదన్ రెడ్డి, పి ఆర్ ఓ అర్జున్ కుమార్, మరియు పి యు రిజిస్టార్ పిండి పవన్ కుమార్ రామకృష్ణ బాధ్యత వహించాలి అన్నారు. బి.ఎడ్ కళాశాలల పై వసతులు లేవని ఫిర్యాదు చేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు న్యాయం చేయలేని స్థాయిలో యూనివర్సిటీ అధికారులు ఉంటే రాజీనామా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా పాలమూరు యూనివర్సిటీ నుండి స్పందన లేకపోవడం ఆశ్చర్యం ఉన్నారు .పి యు ఉన్నతాధికారులు విద్యార్థులకు న్యాయం చేస్తారా? బీఎడ్ కళాశాల కరస్పాండెంట్ లకు దోచి పెట్టి న్యాయం చేస్తారా అని ఎద్దేవా చేశారు. పి యు ఉన్నతాధికారులు వారం రోజులలో స్పందించకపోతే బి.ఎడ్ కళాశాలల పై ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు .దీనికి పూర్తి బాధ్యత పాలమూరు విశ్వవిద్యాలయం బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. జె డి చంద్ర కిరణ్ ఒక్కడినే బాధితుడిని చేయడం కూడా బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, మండల నాయకులు నరసింహ ,చందు, అనిల్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.