పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై తమ ఆట ,పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న మహబూబ్ నగర్ జిల్లా సమాచార శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాన్ని అభినందించిన రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ...

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై తమ ఆట ,పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నందుకు గాను మహబూబ్ నగర్ జిల్లా సమాచార శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాన్ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్  ఎన్.సత్యనారాయణ అభినందించారు.శుక్రవారం భగీరథ కాలనీ లో హరితహారం కార్యక్రమం కింద  ఇంటింటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమంలో కళాజాత బృందం పాల్గొని మొక్కల ప్రాధాన్యత ను వివరిస్తూ పాడిన పాటలు ఆకట్టుకోవడం తో  సి డి ఎన్ ఏ వారిని అభినందించడమే కాకుండా మొక్కలను అందజేశారు. జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభమైన పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో  కళాజాత బృందాలను ఏర్పాటు చేసి  పట్టణాలు, గ్రామాలలో పారిశుద్ధ్యం, హరితహారం కింద  మొక్కలు నాటడం, సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  వంటి అంశాలపై తమదైన శైలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాలు జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలను ఇస్తున్నాయి.మొదటిరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ,హన్వాడ మండల కేంద్రంతో పాటు, బుద్ధారం, కారం తండాలలో ప్రదర్శనలను ఇచ్చాయి. రెండవ రోజు భగీరథ కాలనీ,మొనప్ప గుట్ట తో పాటు, హన్వాడ మండలం టంకర , కొత్తపేట, అడ్డాకుల మండలం పొన్నకల్, శాఖాపూర్ గ్రామాలలో ప్రజలను చైతన్యం చేశాయి.