అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు

అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు ఈరోజు GVS, LHPS సంఘల పిలుపు మేరకు పోదాం మన ప్రగతిభవన్ కలుద్దాం మన ముఖ్యమంత్రి ని అనే కార్యక్రమం ఉండగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం విడ్డూరం ఈ సందర్భంగా GVS జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్  మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి సాధికారత పై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని అంతేకాకుండా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు చేయకుండా police Act:30 సాకుగా చూపుతున్న ముందస్తు అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుచేటని మండిపడ్డారు.డిమాండ్ గిరిజనులు సాగు చేసిన పోగు భూములకు పట్టాలు ఇవ్వాలి.ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలి.తండాలను  రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని.
 ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి.గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి బోర్డు నియమించాలి. ఎస్టి కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు అందజేయాలి.తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.నూతనంగా ఏర్పడిన తండాలు గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను వెంటనే నిర్మాణాలు చేపట్టాలి.ఈ కార్యక్రమంలో రమావత్ రవి రాథోడ్, చత్రపతి నాయక్  పాల్గొన్నారు.