పనితీరు సరిగా లేని ఏపీఎం లతో సహా మేనేజర్లు, ఇతర సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు హెచ్చరించారు.

పనితీరు సరిగా లేని ఏపీఎం లతో సహా మేనేజర్లు, ఇతర సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు హెచ్చరించారు. వారం రోజుల్లో స్త్రీ నిధి పథకం కింద క్రెడిట్ పెంచడంతోపాటు, రుణాల వసూలులో పురోగతి చూపించకపోతే చర్యలు తప్పవని అన్నారు.
      మంగళవారం ఆయన బండమీద పల్లి లోని టీటీడీ సిలో నిర్వహించిన స్త్రీ నిధి జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .
     మండలాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ  ఎన్ పి ఎం 44 శాతం ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చే వారం రోజుల్లో స్త్రీనిధి  లో ఎన్ పి ఎం తగ్గించడంతోపాటు, క్రెడిట్ ను పెంచాలని చెప్పారు. ఒకవేళ పనితీరులో మార్పు లేనట్లయితే తప్పనిసరిగా చర్యలు చేపడతామని అన్నారు.
        స్త్రీ నిధి కింద మండల సమాఖ్యలు కొత్తగా ఆదాయ మార్గాల అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ప్రత్యేకించి ఇప్పటివరకు  చేపట్టని కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా ఆయన ఆదేశించారు. స్త్రీనిధి, మహిళా స్వయం సహాయక బృందాలు,సెర్ప్, అన్ని ఏపిఎంల పరిధిలోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
        వీటితోపాటు  సువిధ  పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు ప్రోత్సహించాలని  చెప్పారు.
     హన్వాడ,  రాజాపూర్, బాలానగర్ మండలాల పనితీరు బాగుండటం పట్ల ఆ మండల బృందాలను కలెక్టర్ అభినందించారు.

        కోవిడ్ పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం మార్చిలో కోవిడ్ ఉండేదని ఈసారి కూడా కోవిడ్ కేసులలో కొంచెం పెరుగుదల ఉన్నందున గతంలో మాదిరిగానే మహిళా స్వయం సహాయక బృందాలు  మహబూబ్ నగర్ కమ్యూనిటీ వాచ్ ను మరొకసారి పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాలలో ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. ప్రజారోగ్యం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందువల్ల మహిళా స్వయం సహాయక బృందాలు కూడా ఈ బాధ్యతలు తీసుకొని ప్రజలు కోవిడ్ బారినపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేశారు .