ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ నిరుపేదలకు సేవ చేయడమే నా లక్ష్యం... దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన కావలి పవన్ కుమార్ యాదవ్....
ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ నిరుపేదకు శివ చేయడమే నా లక్ష్యం అని దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన కావలి పవన్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో ఆయన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా అభిమానులు కేర్ ఫౌండేషన్ సమస్త సహాయ పౌండేషన్ సభ్యులు వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు అభిమానులు గజమాలతో శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా అభిమానులు దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా అభిమానులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. నేను ఎక్కడో మూలన ఉన్న నన్ను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేసిన నా కార్యకర్తలకు నా అభిమానులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. నా జీవితంలో ఎప్పుడు వారిని మరువని అన్నారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. నగరాలలో దేశభక్తి పొంగిపోతున్న యువజన దేశభక్తి ని మార్చగలగుతారు అని అన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో నాజన్మదిన సందర్భంగా ఇంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. ఇప్పుడున్న రాజకీయాలలో ప్రజలను డబ్బులు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో నా జన్మదినానికి స్వచ్ఛందంగా ముందుకు ఒకే ఒక్క రూపాయి ఆశించకుండా వచ్చే సేవలో పాల్గొని రక్తదానం చేయడం పదిమందికి ప్రాణాలను నిలపడం చాలా గొప్ప విషయం అన్నారు. ఒక వ్యక్తి కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడం అంటే ఆయన నాయకత్వం చాలా గొప్పదని ప్రజల నమ్మకం తోనే వచ్చారని ఆయన అన్నారు. నన్ను నా నాయకత్వాన్ని నమ్మి వచ్చిన ఆత్మలకు జీవితాంతం రుణపడి ఉంటానని వారికి ఎల్లవేళలా ఈ ఆపద వచ్చినా ఆదుకుంటారని ఆయన భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో పేద వారికి మరింత సేవచేసే భాగ్యం ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా మీద అభిమానంతో అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 30 మంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అంతకుముందు జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ని లంగా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ యాదవ్ యువసేన నాయకులు కల్వకుంట్ల కావాలి శేఖర్ యాదవ్, లాల్కోట కింగ్ ఊరి అంజన్న యాదవ్, రవీందర్ రెడ్డి శేఖర్ యాదవ్ వెంకటన్న కౌకుంట్ల అంజన్న యాదవ్, వీరితో పాటు సహాయ పౌండేషన్ జిల్లా అధ్యక్షులు శివ కుమార్ యాదవ్, వెంకటేష్ మహేష్ రాజు కేర్ ఫౌండేషన్ సభ్యులు కావలి పవన్ కుమార్ యాదవ్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.