అంత్యక్రియలకు ఆర్థిక సాయం....

అంత్యక్రియలకు ఆర్థిక సాయం.... 
మండలం పరిధిలోని రాయపల్లి గ్రామానికి చెందిన తిర్మలాపూర్ సరస్వతి(65) అనారోగ్యంతో మరణించారు.మరియు తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నాగమ్మ మరణించడం జరిగింది.ఈ విషయాన్ని దొండ్లపల్లి ఎంపీటీసీ చించోడు అభిమన్యు రెడ్డికి యువసేన సభ్యులు తెలియజేయడం జరిగింది. ఇరువురిమృతికి సంతాపం తెలిపి, ఆర్థిక సాయన్ని ప్రకటించిన దొండ్లపల్లి ఎంపీటీసీ చించొడ్ అభిమన్యు రెడ్డి .అంత్యక్రియల ఖర్చుల కోసం ఒక్కొక్క బాధిత కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు మొత్తం 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన నాయకుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాయపల్లి గ్రామ సర్పంచ్ గంగాధర్ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింలు గౌడ్, అభిమన్యు రెడ్డి యువసేన మండల అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్, బంగారివెంకటేష్,ఉద్దేశ్ గౌడ్, లింగమయ్య గౌడ్, తిరుపతయ్య గౌడ్, పర్వతాలు గౌడ్, సందీప్ గౌడ్, గోవర్ధన్, TRS పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.