అంత్య క్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయం...
అంత్య క్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయం...
రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో వార్డ్ మెంబర్ నర్సింలు తల్లి చాకలి బాలమ్మ (70)అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే దొండ్లపల్లి MPTC చించోడు అభిమన్యు రెడ్డికి తెలియజేయగా వెంటనే స్పందించి సంతాపాన్ని ప్రకటించి, అంత్య క్రియలకు 5000/- రూపాయల ఆర్థిక సహాయన్ని యువసేన నాయకుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మహేశ్వరి మైపాల్ రెడ్డి, యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, మాజీ కో ఆప్షన్ నెంబర్ తాహెర్ పాషా, డిప్యూటీ సర్పంచ్ శంకర్ నాయక్, యువసేన సభ్యులు పుల్లారెడ్డి, శ్రీనివాస రెడ్డి, బంగారివెంకటేష్, వార్డ్ మెంబర్స్ బాలయ్య, శ్రీను, రామచంద్రి, శ్రీనివాస్, నర్సింలు, చంద్రయ్య, వెంకటయ్య, భాస్కర్, లస్కర్, సంతోష్, TRS పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.