ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ...

 ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ...   కోయిలకొండ మండలంలో ఉన్న మో ది  పూర్ గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామిని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆంజనేయస్వామికి గ్రామస్తులు  ప్రత్యేక పూజలు చేస్తారు . ఆంజనేయస్వామికి సమీపంలో ఉన్న చెరువు నుంచి జల్ది బిందె ఉత్సవం బాజా భజంత్రీల మధ్య భక్తి పాటలతో వైభవంగా కొనసాగింది. స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి, భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పిటిసి , విజయభాస్కర్ రెడ్డి, నారాయణపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణయ్య, సర్పంచ్ స్వప్న రవి, నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ , రవి , భీ 0 రెడ్డి , తదితరులు పాల్గొన్నారు