అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయండి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్...

అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయండి

ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
గురుకుల పాఠశాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సోలా పోగుల స్వాములు
 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సోలా పోగుల  స్వాములు అన్నారు. శనివారం మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో  సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.20వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల కార్యదర్శి అదనపు డిజిపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేస్తారని ఆయన అన్నారు. ఏ విగ్రహావిష్కరణకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం ప్రచార కమిటీ ఫుడ్ కమిటీ ర్యాలీ కమిటీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ సీనియర్ నాయకులు తోకల కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మండల అధ్యక్షులు ఎస్ శేఖర్ సి ఆర్ ఓ చంద్రశేఖర్ ఉంద్యాల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట నిర్వాహకులు నెల్సన్ జేమ్స్ యోనా రాజబాబు సూరి మహిమ రాజు బి ఎల్ వినోద్ దండు వెంకటేష్ బాబురావు ఏసన్న కే శ్రీను దినకర్ బాలరాజు జైపాల్ ప్రకాష్ నరేష్ సూపర్ తదితరులు పాల్గొన్నారు.