అంబేద్కర్ కు పీఆర్టీయు టీఎస్ నేతల ఘన నివాళులు...
అంబేద్కర్ కు పీఆర్టీయు టీఎస్ నేతల ఘన నివాళులు...
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, నవ భారత నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు బుధవారం మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పిఆర్టీ యు టీఎస్ జిల్లా అధ్యక్షులు నారాయణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాం రెడ్డి, గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హరినాథ్, ప్రతాప్ రెడ్డి, వి.వి.రావు, రాజశేఖర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశ్విని చంద్ర శేఖర్, పురుషోత్తం గౌడ్, నాగార్జున రెడ్డి, కార్యదర్శి యాదయ్య, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వర్ రెడ్డి, సాయిరాం రెడ్డి, అక్తర్ అహ్మద్, గోపాల్ నాయక్, విజయ్ కుమార్ గౌడ్, స్వామీ, పురేందర్ రెడ్డి, శేఖర్, రాములు మరియు తదితరులు పాల్గొన్నారు.