అంబరాన్నంటిన అభిమన్యు రెడ్డి జన్మదినం...అభిమన్యుని సేవలు ఆదర్శప్రాయం...
అంబరాన్నంటిన అభిమన్యు రెడ్డి జన్మదినం...అభిమన్యుని సేవలు ఆదర్శప్రాయం... చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..టిఆర్ఎస్ పార్టీ యంగ్ లీడర్, దొండ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు చించోడు అభిమన్యు రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో అభిమానులు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. రాజాపూర్ మండల కేంద్రానికి అభిమన్యు రెడ్డి చేరుకోగానే డప్పు మేళాలతో అభిమానులు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అభిమన్యు రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సామాజిక సేవ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా అభిమన్యు రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. రోజురోజుకు తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజల గుండెల్లో నిలిచి పోతున్నారని, అభిమన్యుడి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తి ప్రదాయమని కొనియాడారు. అనంతరం కురుమ యాదవులు గొర్రె పిల్లను బహూకరించి వారు ఏర్పాటు చేసిన కేకును కట్ చేయించారు. అనంతరం 35మంది కురుమ యాదవులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఈద్గన్ పల్లి గ్రామంలో అభిమన్యు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమన్యు రెడ్డిని శాలువాతో సన్మానించి కేక్ కటింగ్ చేయించారు. గ్రామానికి చెందిన సుమారు 32 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరడం గమనార్హం. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, రైతు బందు అధ్యక్షుడు హన్మగళ్ళ నర్సింలు మాట్లాడుతూ.. నిత్యనూతనంతోప్రతిదినం ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తూ.. ప్రజల లో ప్రేమ అభిమానం తో అభిమాని రెడ్డి పేరు నాటుక పోతోందని కొనియాడారు. రాజాపూర్ ముఖ్య కూడలిలో అభిమన్యు యువసేన ఏర్పాటుచేసిన భారీ కేకును వేదికపై డాక్టర్ సి లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి అభిమన్యు రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేయించారు. మండల పరిధిలోని ఇబ్రహీం పల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మందికి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన అభిమన్యు రెడ్డి అభిమానులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమన్యు రెడ్డికి శాలువా బుక్ కె ఇచ్చి దండలు వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అభిమాని యువసేన నాయకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు