అమరుడైన ఆర్మీ జవాన్ కు అరుదైన గౌరవం గువ్వొనికుంట తండా లో అమర ఆర్మీ జవాన్ విగ్రహ ఏర్పాటు...
అమరుడైన ఆర్మీ జవాన్ కు అరుదైన గౌరవం గువ్వొనికుంట తండా లో అమర ఆర్మీ జవాన్ విగ్రహ ఏర్పాటు...ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సైనిక మిత్ర బృందంఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై విగ్రహన్ని ఆవిష్కరణ చేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. గండీడ్ వెలుగు;ఇటీవల విధినిర్వహణలో అమరుడైన ఆర్మీ జవాన్ పరశురాం విగ్రహం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సైనిక మిత్ర బృందం ఆధ్వర్యంలో గండేడ్ మండలం లోనిఆయన స్వస్థలం గువ్వొనికుంట తండా లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అమర ఆర్మీ జవాన్ పరశురామ్ సేవలు వెలకట్టలేనివాని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు ముందుగా వీర జవాన్ విగ్రహాన్నిఆవిష్కరించి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందేలా కృషి చేస్తామన్నారు 25 లక్షల ఆర్థిక సాయం ఐదెకరాల భూమి జిల్లా కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ గువ్వొని కుంట తండా లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అలాగే పరశురాం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం పిల్లల చదువులు చదివించేందుకు బాధ్యత తీసుకుంటామని కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యాలీ బాయ్, జెడ్ పి టి సి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీపి మాధవి, ఉమ్మడి సైనిక మిత్రబృందం, అమరా ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు, తండా యువకులు పాల్గొన్నారు.18GAND01 అమర ఆర్మీ జవాన్ విగ్రహన్నిఆవిష్కరణ చేస్తున్న ఎమ్మెల్యే , ఉమ్మడి జిల్లాసైనిక మిత్ర బృందం సభ్యులు