అక్రమ డంపింగ్ ఇసుక సీజ్....ట్రాక్టర్, జెసిబి స్వాధీనం ...

అక్రమ డంపింగ్ ఇసుక సీజ్....ట్రాక్టర్, జెసిబి స్వాధీనం ... రాజాపూర్ వాగులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయడంతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తాహసిల్దార్ శంకర్ వెల్లడించారు.సోమవారం ఆర్ఐ ఖదీర్ ఆధ్వర్యంలో రాజాపూర్ వాగులో సుమారు పది నుంచి పదిహేను ట్రాక్టర్ల అక్రమ ఇసుకను డంపులను గుర్తించినట్లు తెలిపారు.అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఒక ట్రాక్టర్ ను జెసిబి ని కూడా పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. అక్రమ ఇసుక వ్యాపారానికి పూనుకున్న సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాహసిల్దార్ స్పష్టం చేశారు.