అదుపుతప్పి ఆటో బోల్తా ఒకరు మృతి ఇద్దరికి గాయాలు.
అదుపుతప్పి ఆటో బోల్తా ఒకరు మృతి ఇద్దరికి గాయాలు. మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటం తో తండాకు చెందిన రమేష్ నాయక్ 22 అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికుల వివరాల ప్రకారం రమేష్ నాయక్ తన తల్లి నీలి తో పాటు శ్రీశైలం తో కలిసి జడ్చర్ల నుండి ఆటోలు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో కొత్త పల్లి గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడగా ఆటో నడుపుతున్న రమేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా నీలి శ్రీశైలం కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ జయప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి గాయపడినవారిని చికిత్స నిమిత్తం 108లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.